ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన నాలుగు నెలల మనవడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో ఆయనకున్న వాటా నుంచి 0.04%, అంటే 15,00,000 షేర్లను మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి కానుకగా ఇచ్చారు.

వీటి విలువ రూ.240కోట్లపైనే! దీంతో ప్రస్తుతం మూర్తి షేర్లు 0.40% నుంచి 0.36శాతానికి తగ్గాయి. కాగా గత ఏడాది నవంబరులో నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి-అపర్న కృష్ణన్ దంపతులు ఏకగ్రహకు జన్మనిచ్చారు.