నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది.

కారు ముందు భాగం ధ్వంసం కాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అది అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. పులి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.