ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాటుకు నిర్వాహకులు నేడు (సోమవారం) కర్రపూజ చేశారు. ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.

కర్రపూజ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఖైరతాబాద్లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం. గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు అన్ని విభాగాలను సన్నద్ధం చేస్తున్నాం. అని నాగేందర్ వివరించారు.