ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ స్కూల్ సేల్ ప్రారంభమైంది. ఇందులో ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐ మ్యాక్పై పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. నిర్దిష్ట కొనుగోళ్లు చేసిన వారికి ఎయిర్పాడ్స్, యాపిల్ పెన్సిల్ ఉచితంగా ఇస్తోంది.

విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన సేల్ సెప్టెంబర్ 20 వరకు అందుబాటులో ఉంటుంది. కేవలం యాపిల్ ఆన్లైన్ స్టోర్లో మాత్రమే ఈ ఆఫర్లు పొందొచ్చు.