ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది.
అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్ లో వెల్లడించలేదు. కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం. ఇది హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లకు వర్తిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.