ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వ్యాధి వణికిస్తున్నది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 500 మంది మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు.

దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) వ్యాధి తీవ్రత ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితికి దారితీస్తుందో లేదో నిర్ణయించడానికి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ వ్యాధి జంతువులతో ప్రత్యక్ష సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది.