జపాన్ లోని హక్కైడోలో న్యూచిటోషే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కత్తెర పోవడంతో 36 విమానాలు రద్దయ్యాయి. మరో 201 విమానాలు ఆలస్యమయ్యాయి.

శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇక్కడి డిపార్చర్ లాంజ్ లోని ఓ దుకాణంలో కత్తెర కనిపించకపోవడంతో ప్రయాణికుల సెక్యూరిటీ చెకింగ్ను 2 గంటలపాటు నిలిపివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు తాత్కాలికంగా అక్కడే చిక్కుకుపోయారు. అయితే మరుసటి రోజు అదే దుకాణంలో కత్తెరను స్వాధీనం చేసుకున్నారు.