localnewsvibe

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్దాం, కుప్వారా, బారాముల్లా, బందిపొర, అనంత్నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతోపాటు 298కంపెనీల పారామిలటరీ బలగాల విధుల్లో ఉన్నట్టు వెల్లడించారు.