హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ను హైడ్రా అని పిలుస్తారు. హైడ్రా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది.

ఎఫ్ టి ఎల్ పరిధిలో నిర్మాణాల కొరకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయడానికి హైడ్రా సిద్ధం కావడం గమనార్హం. మొత్తం ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసుల నమోదు దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

హైడ్రా సైబరాబాద్ కమిషనర్ కు ఇందుకు సంబంధించి సిఫారసు చేయగా అధికారులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది. పలువురు డిప్యూటీ కమిషనర్లు, ప్లానింగ్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్ ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఆయా అధికారులకు సంబంధించిన వివరాలు సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతోంది.

స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకోని అధికారులపై హైడ్రా ప్రత్యేక దృష్టి పెట్టింది. నిబంధనలను నీళ్లొదిలిన అధికారులపై కూడా చర్యలు చేపెట్టే దిశగా హైడ్రా అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు అధికారులు ఏకంగా 200కు పైగా నిర్మాణాలను కూల్చివేసినట్టు తెలుస్తోంది. నిబంధనలు అమలు చేయని అధికారుల లెక్క తేల్చే దిశగా అడుగులు పడుతున్నాయి.

హైడ్రా పనితీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండటం గమనార్హం. అయితే ప్రజల నుంచి వస్తున్న కొన్ని నెగిటివ్ కామెంట్లను సైతం హైడ్రా తెలుసుకుని ఆ కామెంట్లు రిపీట్ కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి సైతం హైడ్రా అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.