పారిస్ వేదికగా పారాలింపిక్స్ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. పారాలింపిక్స్ సంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేశారు.

ఫ్రెంచ్ స్విమ్మర్ థియో కురిన్ ప్రేక్షుకులకు వెల్ కం చెప్పడంతో వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 140 మంది డ్యాన్సర్లు ప్రదర్శనలో పాల్గొన్నారు. జావెలిన్ త్రోయర్ సుమిత్, మహిళా షాట్పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతకధారులుగా వ్యవహరించారు.