ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ చేయూత అందించడంలో ముందుంటుంది చిత్రసీమ.

భారీ వర్షాలు… వరదలతో అతలాకుతలం అవుతున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకూ సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి బాధిత ప్రజల సహాయార్థం తన వంతుగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపారు.