దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) సమావేశం నిర్వహించారు.

ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. డీఏసీ ఆమోదంతో సేకరించిన నిధులతో భారత సైన్యం తన యుద్ధ ట్యాంకులను ఆధునీకరించాలని డిసైడ్ అయ్యారు.