హైదరాబాద్ – విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది.
ఆ రూట్ల లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.