‘హైడ్రా’ ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్న చర్యలు కరెక్టేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

కానీ, అదే సమస్యకు పరిష్కారం కాదని, చెరువులు ఆక్రమణలకు గురికాకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కఠినచర్యలు తీసుకోవాలని తెలిపారు. హైడ్రాను ఏపీలో అమలు చేస్తే… కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. మానవత్వ కోణంలో తాము సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.