పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటివరకున్న అర్హతలను సవరించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలను సులభంగా అందించడానికి ఆరోగ్య కార్డుల జారీకి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.