సూర్యభగవానుడు ధనుఃరాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ కాలం మహా విష్ణువుకు ప్రీతికరమని వేద పండితులు చెబుతున్నారు.
16న ఉదయం 6:44 గంటల నుంచి ధనుర్మాసం ప్రారంభమై సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే మకర సంక్రాంతి జనవరి 14న పూర్తవుతుంది. జనవరి 13న భోగి పండుగ నాడు శ్రీవైష్ణవ ఆలయాలలో శ్రీగోదాదేవి, రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం జరగనుంది.