డబ్బు కోసం ఓ యువకుడు తన సొంత అమ్మమ్మను హత్య చేయించిన దారుణం ఇది. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాకు చెందిన ఆకాశ్, తన అమ్మమ్మ పేరిట రూ. కోటి బీమా చేయించాడు.

కొన్నాళ్ల తర్వాత ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చి పాముతో ఆమెకు కాటు వేయించాడు. వృద్ధురాలు కన్నుమూయగానే బీమా సంస్థ నుంచి రూ.కోటి పొందాడు.

అయితే ఈ విషయంలో అనుమానం వచ్చిన స్థానిక పోలీసులు తమదైన శైలిలో ఆకాశ్ను విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది.