రైతుల ‘ఢిల్లీ చలో’ మార్ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ – హరియాణా సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు.

అయితే, ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో అధికారులు వాటిని పాక్షికంగా తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. వాహనాల రాకపోకలకు వీలుగా సింఘు సరిహద్దు రహదారి ‘సర్వీస్ లేన్’, తిక్రీ సరిహద్దు రహదారికి చెందిన ఒక లేన్ తెరుస్తున్నామని అధికారులు వెల్లడించారు.