రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందినే అర్హులుగా సర్కారు ఎంపిక చేసింది.

దీంతో మిగతా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులే దరఖాస్తులు స్వీకరించడంతో అప్లై చేసుకోవడానికి కుదరలేదని చెబుతున్నారు. రెండో విడత స్వీకరణ త్వరగా మొదలుపెట్టాలని కోరుతున్నారు.