కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్ పంక్చర్ చేస్తున్న నలుగురిపైకి సూపర్ లగ్జరీ బస్సు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సును వెంబడించి పట్టుకున్నారు. మరణించిన వారిని దాసరి ప్రసాద్, కిషోర్, నాగయ్య, రాజుగా గుర్తించారు.