వాలంటీర్లకు ప్రభుత్వం 3 నెలల అదనపు ప్రోత్సాహకాలు అందించనుంది. నెలకు రూ.500 చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మొత్తం రూ.1500 చొప్పున ఒక్కో వాలంటీర్ కు అందిస్తారు.

కాగా ప్రజల ఇళ్ల వద్దకే మొబైల్ ఆటోల ద్వారా రేషన్ పంపిణీలో భాగస్వాములైన వాలంటీర్లకు నెలకు రూ.500 చొప్పున ప్రోత్సాహకం చెల్లించాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. త్వరలో ఎన్నికలు రానుండటంతో చెల్లింపులపై తాజాగా ఆదేశాలు ఇచ్చింది.