రాష్ట్రంలో అమలు కానున్న ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’లో రైతుల వాటా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఈ వానాకాలం నుంచి పధకాన్ని అమలు చేస్తామని.. రైతులందరికీ, అన్ని పంటలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. గతంలో పరిహారం చెల్లింపులు ఆలస్యంగా జరిగేవని కానీ ఇప్పుడు యెల్టెక్, విండ్స్ మొదలైన సాంకేతికతో పంట నష్టాలను నిర్ధారించి వేగంగా నగదు బదిలీ చేస్తామన్నారు.