భారత్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. జూన్-ఆగస్టు మధ్య లానినా ఏర్పడితే 2023లో కంటే ఈ ఏడాది రుతుపవనాల ద్వారా మెరుగైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు ప్రస్తుతం ఎల్నినో చాలా బలంగా ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది. ఈ ఏడాది మార్చి- మే మధ్యలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.