నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

ముందుగా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్తో, ఆ తర్వాత బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం పార్లమెంట్ కన్వీనర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలు, ప్రచారంపై మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.