సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని పలు బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించినట్లు సమాచారం. దీనిపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.

సైబర్ సెక్యూరిటీ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ (CSITE) సమీక్ష నిర్వహించిన అనంతరం RBI ఈ సూచనలు చేసింది. సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని RBI డిప్యూటీ గవర్నర్ రవి శంకర్ సైతం ఇటీవల పేర్కొనడం గమనార్హం.