ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ నెల 27 నుంచి దాదాపు 21 రోజులపాటు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు.

అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుందని, 25 సభలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎన్నికల బహిరంగసభల్లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నాయి.