అల్లు అర్జున్ పుట్టిన రోజున(ఏప్రిల్ 8) పుష్ప-2 మూవీ నుంచి తొలి సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఐకాన్ స్టార్ బర్త్ డే రోజున విడుదల చేసిన టీజర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.