మంచు ఖండం అంటార్కిటికాలో ఓ జాబ్ ఆఫర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూకే అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ అక్కడ పోర్ట్ లాక్రామ్లోని పోస్ట్ ఆఫీసులో పనిచేసేందుకు ఐదుగురు ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చింది.

మెయిల్స్ నిర్వహణ, పెంగ్విన్లను లెక్కపెట్టడమే వీరి పని. ఈ ఏడాది నవంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య ఐదు నెలల పాటు బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే కోసం పనిచేయాలట. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు.