కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. ఓ షాపులో ‘హనుమాన్ చాలీసా’ను ప్లే చేయడంతో దుకాణ యజమానిపై కొందరు దాడికి దిగిన వీడియోను ‘కర్ణాటక BJP’ షేర్ చేసింది.

‘హిందువులను భయభ్రాంతులకు గురిచేసే రాడికల్స్ వీధుల్లోకి వచ్చారు. రాహుల్ గాంధీ హిందువులపై యుద్ధం ప్రకటించడంతో హనుమాన్ చాలీసా పఠించే వారిపై సీఎం సిద్దరామయ్యకు చెందిన వీధి గూండాలు దాడులు చేస్తున్నారు’ అని మండిపడింది.