అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మహిళలకు రక్షణగా నిలబడాల్సిన పోలీసే ఓ మైనర్ (15)పై అత్యాచారానికి పాల్పడ్డాడు.
DSP హోదాలో లచిత్ బోర్ఫుకన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న నిందితుడు కిరణ్ నాథ్ ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తనను ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడటమే కాక కుటుంబసభ్యులతో కలిసి చిత్రహింసలకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.