ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీలో 26వ చిత్రం త్వరలో తెరకెక్కనుంది. జేమ్స్ బాండ్ గా మెప్పించిన డేనియల్ క్రెగ్.. వయసురీత్యా కొత్త సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

ఆయన స్థానంలో ఆరోన్ టేలర్ జాన్సన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. గాడ్జిల్లా, అవెంజర్స్ వంటి సినిమాల్లో ఇతను నటించారు. ఈ మూవీకి క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ చేస్తారని హాలీవుడ్ టాక్.