ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేసే విషయంలో ఈడీ రూల్స్ పాటించలేదన్న BRS MLC కవిత వాదనను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. PMLA చట్టంలోని సెక్షన్-19ను ED పాటించిందని న్యాయమూర్తి నాగ్పాల్ ఇచ్చిన తీర్పు బయటకొచ్చింది. అమెను సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్ చేసి, 24 గంటల్లోపు తమ ముందు హాజరుపరిచారని కోర్టు పేర్కొంది. అటు సెక్షన్-19లోని నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదంది.