బాడీ మసాజర్ ను అడల్ట్ సెక్స్ టాయ్ గా పరిగణించలేం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే దానిని నిషేధిత దిగుమతి వస్తువుల జాబితాలో చేర్చకూడదని పేర్కొంది.

బాడీ మసాజర్ సెక్స్ టాయ్ కాదంటూ 2023 మేలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కస్టమ్స్ అధికారులు వేసిన పిటిషన్ను హైకోర్టు తాజాగా కొట్టేసింది.