టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై తరఫున ఆయన ఇవాళ, రేపు ఓట్లు అభ్యర్థించనున్నారు.

కోయంబత్తూరులో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో లోకేశ్ రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.