‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ షాక్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో గత నెలలో ఇచ్చిన ‘సున్నా’ బిల్లులను వెనక్కి తీసుకుంది. HYDలోని సరూర్నగర్ ఓ వినియోగదారుడికి మార్చి 2న రూ.262తో జీరో బిల్లు ఇచ్చారు.

ఈనెల రూ.547 రాగా.. మొత్తం కలిపి రూ.809 చెల్లించాలని కొత్త బిల్లు జారీ చేశారు. అయితే.. సాంకేతిక సమస్యతో మార్చిలో సున్నా బిల్లులు జారీ అయ్యాయని డిస్కం అధికారులు చెప్పారు.