గన్ పార్క్ వద్ద ప్రమాణం చేసేందుకు రాజీనామా లేఖతో హరీశ్ రావు అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంతు ఆయన సవాలు చేసిన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

BRS శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడం, అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్ద 144 సెక్షన్, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని పోలీసులు చెప్పడంతో హరీశ్ రావు అసెంబ్లీ లోపలికి వెళ్లినట్లు సమాచారం.