నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వర్షాలు సరిపడినంతగా పడకపోవడంతో 510.70 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుంటే మేలో తాగునీటిని అందించడం కష్టంగా కనిపిస్తోంది.

నిన్నటి వరకు ఈ జలాశయంలో 132.86 టీఎంసీల నీరు ఉంది. అత్యవసర పరిస్థితుల్లో నీటిని 505 అడుగుల వరకు విడుదల చేయాలని కేఆర్ఎంబీ యోచిస్తున్నట్లు సమాచారం.