బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కమలం పార్టీతో స్నేహం ఉంటే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైలుకు వెళ్తారని ప్రశ్నించారు.

ఆ పార్టీపై తాము నిరంతర పోరాటం చేస్తామన్నారు. తాము తెచ్చిన పథకాలను కాంగ్రెస్ ఆపేసిందని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా మైనార్టీలకు మేలు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదని విమర్శించారు.