తెలుగు ప్రజలు ఎక్కడున్నా అన్ని రంగాల్లో ముందుడాలనేది తెలుగుదేశం లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. గతంలో ఎంతో మందిని ప్రోత్సహించి పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన ఇద్దరూ.. తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లేనని వ్యాఖ్యానించారు. తెలుగోళ్లు అనే నినాదంతో వివక్ష చూపకుండా ముందుకు సాగడం టీడీపీ గొప్పతనమన్నారు.