ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదని ఆప్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.
ఈ నేపథ్యంలో ఆప్ కార్యాలయ నిర్మాణానికి తాత్కాలికంగా భూమి కేటాయించే విషయంపై 10రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్నిసూచించింది.