పాకిస్థాన్ లో భారీ ఉగ్ర దాడి జరిగింది. బన్నూ కంటోన్మెంట్ పై 10 మంది ఉగ్రవాదులు సోమవారం దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గోడను కూల్చివేశారు.

ఈ క్రమంలో ఎనిమిది మంది సైనికులు మృతి చెందినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. దీంతో సైన్యం కూడా ఎదురుదాడి చేయడంతో దాదాపు 10 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.