డేటింగ్ యాప్ పేరుతో మోసం చేసిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు.
డేటింగ్ యాప్ పేరుతో రూ.28 లక్షలు వసూలు చేసి మోసం చేశారని, బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి రూ.6లక్షలు స్వాధీనం చేసుకున్నామని విశాఖ సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ తెలిపారు.