ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్లీర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్ రెండవ త్రైమాసికంలో పలు కంపెనీల ఈక్విటీల నుంచి తన షేర్లను విక్రయిస్తున్నారు. జూన్ నుండి $75.5బిలియన్ల విలువైన స్టాక్లను విక్రయించినట్లు కంపెనీ ఆర్థిక నివేదికలు సూచించాయి.

ముఖ్యంగా ఎక్కువ వాటాను కలిగిన యాపిల్ కంపెనీలో ఉన్నటువంటి స్టాక్లలో సగానికిపైగా విక్రయించడం గమనార్హం. దీంతో బెర్క్లీర్ నగదు నిల్వలు $276.94బిలియన్లు పెరిగాయని నివేదిక తెలిపింది.