2013 ఫిబ్రవరి 1న 80 ఏళ్ల తల్లిని హత్య చేశాడన్న కేసులో పోచయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోచయ్యను 11 ఏళ్ల తరువాత తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది.

మెదక్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన పోచయ్యకి ఈ కేసులో యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. కేవలం ఊహలు, అంచనాల ఆధారంగా కోర్టులు సొంత అభిప్రాయాలు ఏర్పర్చుకోకూడదని స్పష్టం చేసింది.