పురుషుల్లో సంతానలేమిని గుర్తించేందుకు ఇప్పటివరకు వీర్య పరీక్ష చేయాల్సివచ్చేది. ఇక నుంచి ఈ అవసరం లేదంటున్నారు జపాన్ లోని టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు.

రక్తపరీక్షతో పురుషుల్లో సంతానలేమి (వంధ్యత్వం) సమస్యను గుర్తించవచ్చని చెప్తున్నారు. ఇందుకుగానూ వీరు కృత్రిమ మేధ (ఏఐ) మాడల్ను అభివృద్ధి చేశారు. వివిధ హార్మోన్ల స్థాయిలను విశ్లేషించి 74 శాతం కచ్చితత్వంతో పురుషుల వంధ్యత్వాన్ని గుర్తిస్తుందని పేర్కొంటున్నారు.