స్వేచ్ఛగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించే మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోంది. డిజిటల్ సాంకేతికత పెరగడం, సులువుగా పెట్టుబడులను నిర్వహించే వీలుండటం వీరికి కలిసివస్తోందని యాక్సిస్ మ్యూచువల్ఫండ్ నివేదిక వెల్లడించింది.

“ఆంధ్రప్రదేశ్లో 4.7 రెట్లు, తెలంగాణలో 3.1 రెట్లమేరకు మహిళా పెట్టుబడిదారులు పెరిగారు. పెట్టుబడి మొత్తం(ఏయూఎం) ఏపీలో 4.1 రెట్లు, తెలంగాణలో 3 రెట్లమేర పెరిగింది” అని వివరించింది.