ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్.. దేశీయ మార్కెట్ లో తన ఎక్స్-ట్రయల్ కారును ఆవిష్కరించింది. సీబీయూమోడల్లో భారత్ మార్కెట్లోకి వస్తున్న నిసాన్ ఎక్స్-ట్రయల్ ధర రూ.49.92లక్షలు(ఎక్స్ షోరూమ్). 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది.

ఈ కారు గరిష్టంగా 163 పీఎస్ పవర్, 300 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఫ్యుయల్ మైలేజీ కోసం 12V ILIS మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ జత చేశారు.