నోబెల్ బహుమతిపై ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నోబెల్ పొందడం ఆనందమే.. కానీ, అది లభించకపోతే నా జీవితం వృథా అయ్యేదని అనుకోవడంలేదు.

నోబెల్ బహుమతి సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదు. ఆ పురస్కారంతో కొంత డబ్బు వచ్చింది.. దాంతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాను. చిన్నారుల విద్య, ఆరోగ్య సంరక్షణపై కృషిచేయడం సంతృప్తినిస్తోంది”అని పేర్కొన్నారు.