జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశమార్గం ఉన్నట్లు చెప్పారు. 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్డ్రిన్లు దిగిన ‘సీ ఆఫ్ ట్రాంక్విలిటీ’ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.