పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.

1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు. రత్నభాండాగారం తెరిచి, సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన BJPప్రభుత్వం.. సొరంగ మార్గం, రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.